షారుఖ్ ఖాన్ ఇంట్లో విషాదం
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన చెల్లెలు నూర్జహాన్ కన్నుమూశారు. ఆమె పాకిస్థాన్ లో స్థిరపడ్డారు. పెషావర్‌లోని షావాలీ కతల్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో ఆమె స్థానిక నగర పరిషత్‌లో సభ్యురాలుగా కూడా ఉండేవారు. నూర్జహాన్ గత కొన్నాళ్లుగా క్యాన్సర్ గా బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని ఆమె సోదరడు మన్సూర్ తెలిపారు. అనారోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారని మన్సూర్ తెలియజేశారు.
సోదరి నూర్జహాన్ అంటే షారుఖ్ బాగా ఇష్టం. ఆమె షారుఖ్ ని చూసేందుకు రెండుసార్లు భారత్ కి వచ్చారు. షారుఖ్ కూడా సోదరిని చూసేందుకు ఒకట్రెండు సార్లు పాక్ వెళ్లొచ్చినట్టు చెబుతుంటారు. షారూఖ్ ఖాన్, నూర్జహాన్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరీ.. సోదరి అంత్యక్రియల కోసం షారుఖ్ పాక్ కి వెళ్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.