నిర్భయ దోషి పిటిషన్’ని కొట్టేసిన సుప్రీం.. ఫిబ్రవరి1న ఉరి అమలు !
నిర్భయ దోషులకి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకి నిర్భయ దోషులని ఉరితీయాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు, ఈలోపు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడం లేదంటే.. ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి క్షమాభిక్షని తిరస్కరించినా.. నిర్భయ దోషి ముఖేష్ కుమార్ తన జైలులో హింసిస్తున్నారని, తనపై లైంగిక దాడి జరిగిందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీం కోర్టు.. ఆ పిటిషన్ ని కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్భయ దోషులని ఉరితీయడానికి లైన్ క్లియర్ అయినట్టుంది.