కరోనా వైరస్ : కేంద్రానికి మంత్రి ఈటెల రిక్వెస్ట్

కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ అనుమానితుల కోసం స్పెషల్ ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ పై మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ టెస్ట్ ల కోసం బ్లడ్ షాంపిల్స్ ని పూణేకి పంపించడం, ఆ రిపోర్ట్స్ రావడానికి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ల్యాబ్ లని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినట్టు ఈటెల తెలిపారు. 

అంతేకాదు.. హైదరాబాద్ లో ఇంకా కరోనా వైరస్ కేసులు తేలలేదు. దీనిపై దుష్ప్రచారం చేయొద్దని మంత్రి ఈటెల మీడియాని కోరారు. సోషల్ మీడియాలోనూ కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం తగదన్నారు. స్పైన్ ప్లూ ఇతర వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు.. దగ్గు, జలుబు వచ్చిన వారు తీసుకోవాలని మంత్రి సూచించారు. డాక్టర్లు మూడు షిఫ్టులుగా పని చేస్తున్నారని.. కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి ఈటెల తెలిపారు.