మూడో టీ20 : కివీస్ లక్ష్యం180

హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 65 (45బంతుల్లో) రాణించాడు. కెప్టెన్ కోహ్లీ 38, కె ఎల్ రాహుల్ 27, అయ్యర్ 17 పరుగులు చేశారు. మనీష్ పాండే 14, జడేజా 10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెనెట్ 3, సాట్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ ప్రయోగం చేశారు. యువ ఆల్ రౌండర్ శివమ్ దూబెని వన్ డౌన్ లో పంపించారు. కానీ దూబె తీవ్రంగా నిరశాపరిచాడు. 3 పరుగులకే పెలివియన్ చేరాడు. రోహిత్ శర్మ దుబె ఒకే ఓవర్ లో అవుట్ కావడంతో పెద్ద దెబ్బపడింది. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ (38) స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ, స్కోర్ బోర్డ్ ని 200లు దాటించలేకపోయారు. కివీస్ మైదానాలు చాలా చిన్నవి. దీంతో.. ఈ 180 టార్గెట్ ని కాపాడుకోవడానికి టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.