ఉగాదిరోజు పచ్చడి పచ్చడే అంటోన్న ‘వి’లన్ !

ఉగాది రోజు పచ్చడి పచ్చడే అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆయన రాక్షసుడుగా కనిపించబోతున్న సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహన కృష్ణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇండులో సుధీర్ బాబు రక్షకుడుగా, నాని రాక్షసుడుగా కనిపించబోతున్నాడని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే వీరి ఫస్ట్ లుక్స్ ని కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన దక్కడం పట్ల నాని సంతోషం వ్యక్తం చేశారు. 

అభిమానులకి థ్యాంక్స్ చెబుతూ నాని ట్విట్ చేశారు. అంతేకాదు.. ఉగాదిరోజు (మార్చి 25)న పచ్చడి పచ్చడే అంటూ కామెంట్ పెట్టాడు. నాని ట్విట్ ని రీ ట్విట్ చేసిన సుధీర్ బాబు కూడా ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాడు. ఈ చిత్రంలో నానికి జంటగా అతిథిరావు, సుధీర్ బాబుకి జంటగా నివేధా థామస్ కనిపిస్తారని తెలుస్తోంది. ఇక చిత్రబృందం ప్రచారం చేస్తున్నట్టు.. ఈ సినిమాలో నాని విలన్ కాదని.. ఆయన పాత్రకి సంబంధించి బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని సమాచారమ్.