ఘనంగా మెగా మదర్ బర్త్ డే సెలబ్రేషన్స్
మెగా ఫ్యామిలీలో ఇంట్లో ఈరోజు పండగ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తల్లిగారు అంజనాదేవి పుట్టినరోజు నేడు. తల్లి పుట్టినరోజుని మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో మెగా డాటర్స్ అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తల్లి పుట్టినరోజున వేడుకకి మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ఆయన రీ ఎంట్రీ సినిమా పింక్ రిమేక్ లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ తల్లి పుట్టినరోజు వేడుకలకి హాజరుకాలేదా ? లేదంటే.. సలైంట్ వచ్చి తల్లిని కలిసివెళ్లారా ? అన్నది తెలియరాలేదు.