ఆర్ఆర్ఆర్’లో శ్రియా.. ఎవరి పక్కనో తెలుసా ?


సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆయనకి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ అజయ్ దేవగణ్ భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తారని.. భగత్ సింగ్ దిశానిర్థేశంతోనే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడని జక్కన్న సూచించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కి జంటగా శ్రియా కనిపించబోతున్నట్టు సమాచారమ్.  రాజమౌళి దర్శకత్వంలో ఫ్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాలో శ్రియా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ ‘దృష్యం’ సినిమాలో అజయ్ దేవగణ్ కి జంటగా శ్రియా నటించింది. ఆర్ ఆర్ ఆర్ లో శ్రియా నటించడం నిజమే అయితే.. ఆమె ఇటు రాజమౌళితో, అటు అజయ్ దేవగణ్ తో చేస్తున్న రెండో సినిమా అవుతుంది. ఆర్ఆర్ఆర్లో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్నారు. తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ జతకట్టనుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. అయినా.. జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ అక్టోబర్ నెలకి వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతోంది.