‘అశ్వద్థామ’కు మెగా సపోర్ట్

యంగ్ హీరో నాగశౌర్య చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన తాజా చిత్రం ‘అశ్వద్థామ’. ఈ సినిమాకి నాగశౌర్యనే కథ అందించారు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ నిర్మించింది. ట్రైలర్ తో అంచనాలని పెంచేసిన అశ్వద్థామ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి మెగా సపోర్ట్ తీసుకురావడంలో నాగశౌర్య సక్సెస్ అయ్యారు. అశ్వద్థామ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగని.. పవన్ డబ్బింగ్ స్టూడియోకి ఏమీ రాలేదు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని పరోక్షంగా భాగస్వామ్యం చేశాడు. సినిమాలో గోపాల గోపాల సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ ని వాయిస్ ఓవర్ గా వాడుకున్నాడు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు.

 తల్లి ఉషాతో కలిసి శౌర్య బుధవారం చిరు నివాసానికి వెళ్లారు. తమ సినిమాకు ఆశీస్సులు అందచేయాలని కోరగా.. చిరు అశ్వథ్థామ మంచి విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఇలా.. అశ్వద్థామకి మెగా సపోర్ట్ దక్కినట్టయింది. ఈ సినిమాపై నాగశౌర్య గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే అశ్వద్థామ టైటిల్ ని టాటూగా వేసుకున్నాడు. అశ్వద్థామ హిట్ అయితే నాగశౌర్య డ్యూయెల్ రోల్ చేయొచ్చు. హీరోగా నటిస్తూనే.. కథలు రాసుకోవచ్చు. అశ్వద్థామ తేడా కొడితే మాత్రం ఆయన ప్రయోగాలకి పులిస్టాప్ పెట్టేసి.. హీరోగా అచ్చొచ్చిన లవ్ స్టోరీస్ చేసుకోవడమే.. !