తల్లి పాత్రలో రేణు.. పవన్ అవకాశం ఇస్తారా ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అక్క, తల్లి తరహా పాత్రలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా రేణునే తెలిపింది. ‘పెళ్లి చూపులు’, ‘మెంటల్ మదిలో’ చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన కుమారుడు శివను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి రేణు దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తనకు తల్లి పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని, ఆ పాత్ర తనకి బాగా నచ్చేసింది. నటించాలని అనుకున్నా. కానీ ఆ సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేకపోయానని తెలిపారు. మరో సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి పింక్ తెలుగు రిమేక్ కాగా, రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాల్లో రేణు దేశాయ్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని.. ఇప్పటికే ఆమెపై సాప్ట్ కార్నర్ ఉన్న పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరీ.. నిజంగానే పవన్ రేణుకి ఛాన్స్ ఇస్తారా ? అనేది చూడాలి.
గతంలో పవన్- రేణు దేశాయ్ జంటగా నటించిన బద్రీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లు సహజీవనం చేసి.. కొడుకు పుట్టి పెద్దోడు అయ్యాక పెళ్లి చేసుకొన్నారు. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయినా.. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. అన్నట్టు.. పవన్ -రేణు దేశాయ్ కలిసి నటించిన జానీ సినిమా మెగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. కానీ, కమర్షియల్ గా ఆడలేదు.