పవన్ కు పిల్ల తల్లి కావలెను
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా బాలయ్య చాన్నాళ్ల నుంచి హీరోయిన్ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రతి సినిమాకి హీరోయిన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బాలయ్య రేంజ్ లో కాకపోయినా.. మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ సమస్యని ఎదుర్కొంటున్నారు. నాగార్జునది అదే పరిస్థితి. సీనియర్ హీరోలలో ఒక్క విక్టరీ వెంకటేష్ కి మాత్రమే ఇలాంటి సమస్యలేదు. ఆయనకి ఈజీగా హీరోయిన్స్ సెట్ అవుతుంటారు. ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కి హీరోయిన్ సమస్య రావడం హాట్ టాపిక్ గా మారింది.
పవన్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే ఎగేసుకొని వచ్చే వారి సంఖ్య పెద్దదే. వందల్లో వాలిపోతారు. కానీ, ఇక్కడ ఓ సమస్య ఉంది. పవన్ కి యంగ్ హీరోయిన్ నో, సీనియర్ హీరోయిన్ నో కాదు. పిల్ల తల్లి కావాలెను. పింక్ రిమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.
కథ ప్రకారం పింక్ రీమేక్ లో హీరోయిన్ ఓ బిడ్డకు తల్లి. మరి బిడ్డకు తల్లి అనే వయస్సు క్యారెక్టర్ ను చేయడానికి ఏ హీరోయిన్ రెడీగా లేదని తెలుస్తోంది. ఎంత పవర్ స్టార్ సినిమా అయినా, ఎంత దిల్ రాజు నిర్మాత అయినా, హీరోయిన్లు బిడ్డ తల్లిగా చేయడానికి ఆలోచిస్తారు కదా? ఇప్పుడు పింక్ రిమేక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
ఆకాంక్ష, రకుల్ ప్రీత్ సింగ్ లని ట్రై చేస్తున్నారు. ఆకాంక్ష ఓకే చెప్పింది. కానీ ఆమె కంటే రకుల్ ఓకే చెబితే బెటర్ అని దిల్ రాజు భావిస్తున్నారు. మరోవైపు, రేణు దేశాయ్ మళ్లీ తల్లి పాత్రలు వేయడానికి ఇటీవల ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమెను, పవన్ ను కనుక ఒప్పించగలిగితే, సినిమాకు క్రేజ్ మామూలుగా వుండదని ప్రచారం జరుగుతోంది. మరీ.. పవన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా ? అన్నది చూడాలి.