బ్రేకింగ్ : సమత నిందితులకి ఉరిశిక్ష ఖరారు
సమత కేసులో అదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు నిందితులకి ఉరిశిక్షని విధిస్తూ తీర్పుని వెల్లడించింది. సమత కేసులో ఏ1 నిందితుడిగా షేక్ బాబు, ఏ2 నిందితుడుగా షేక్ షాబోద్దీన్, ఏ3 నిందితుడిగా షే ముగ్దుం ఉన్నారు. ఈ ముగ్గురికి ఉరిశిక్షని విధిస్తూ అదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్షని విధించింది. కోర్టు తీరుపై స్థానికులు, సమత ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొమరభీమ్ జిల్లాలో సమతపై హత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. కూలి పని చేసుకునే మమతపై ముగ్గురు నిందితులు షేక్ బాబు, షేక్ షాబోద్దీన్, షే ముగ్దుం అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు. రెండు నెలల క్రితం చోటు చేసుకొన్న ఈ ఘటనలో ఇప్పటికీ నిందితులకి శిక్ష పడింది. మొన్న నిర్భయ నిందితుల ఎన్ కౌంటర్, నేడు సమత కేసులో నిందితులకి ఉరిశిక్ష పడటంతో.. రేప్ కేసుల్లో కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు న్యాయస్థానాలు సంకేతాలివ్వడం హర్షించదగ్గ విషయం. సమత కేసులో 66 రోజుల్లోనే నిందితులకి ఉరిశిక్ష ఖరారైంది.