కవితక్క ఇలాకలో వర్గపోరు.. !
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఆయా జిల్లాలో వారిదే పెత్తనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్. మంత్రి హరీష్ రావు సిద్ధిపేట. మంత్రి కేటీఆర్ కరీంనగర్. ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లాలని యేలుతుండ్రు. ఐతే, కవితక్క ఇలాకలో నేతల మధ్య సఖ్యత లేనట్టు కనబడుతోంది. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో ముసలం చెలరేగింది. నేతల వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది.
ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని కోరుతూ మరో వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపిస్తోంది. ఈ పంచాయతీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దాక వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి పోచారం నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సస్పెన్షన్‌కు సిఫార్సు ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారమ్. చివరకు కవితక్క రంగంలోకి దిగితే గానీ.. ఈ గొడవలకు పులిస్టాప్ పడదని జిల్లా నేతలు గుసగుసలాడుకొంటున్నారు. మరీ.. ఇంకా సీతక్క చెవిన ఈ ముచ్చట పడనట్టుంది.. !!