వైరల్ : నివేదా పేతురాజ్ చీర అందాలు


టాలీవుడ్ లో హవా చూపిస్తున్న యంగ్ హీరోయిన్స్ నివేదా పేతురాజ్ ఒకరు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముంచుకొచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ నివేదా సందడి చేసింది. ఈ సినిమాలో నివేదా నటనకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా నివేదా చాలా పద్దతిగా తయారైంది. చీరకట్టులో ఫోటోలకి పోజులిచ్చింది.

మోడ్రన్ డ్రెస్సుల కంటే చీరకట్టులో నివేదా నిండైన అందాలతో కనిపిస్తోంది. ప్రస్తుతం నివేదా చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా ట్రెడింగ్ లో నిలిచాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. పేతురాజుకి యంగ్ హీరోలతో పాటు, స్టార్ హీరోల నుంచి పిలుపులు వస్తున్నట్టు సమాచారమ్. ఐతే, పేతురాజు మాత్రం ఏవి పడితే అవి చేసేందుకు సిద్ధంగా లేదు. సెలక్టివ్ గా వెలుతోంది.

సినిమాలు లేవని కంగారు పడకుండా.. ఖాళీ సమయాల్లో హాయిగా ఫోటో షూట్స్ చేసుకుంటోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, షాపింగ్ మాల్స్ ప్రమోషన్స్ కోసం ఫోటో షూట్స్ చేస్తోంది. తాజా ఫోటో షూట్ అందులో భాగంగానే చేసినదిగా కనిపిస్తోంది. పేతురాజు చీర కట్టు అందాలని మీరు చూసి.. ఎంజాయ్ చేయండీ.. !