‘అశ్వద్థామ’ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో నాగ శౌర్యకు లవ్ స్టోరీస్ బోర్ కొట్టాయ్. దాంతో ఆయన థ్రిల్ అవ్వడంతో పాటు ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు. అదే ‘అశ్వద్థామ’ సినిమా. స్వయంగా నాగ శౌర్యనే కథ అందించాడు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదలై.. పూర్తయ్యే వరకు పెద్దగా అంచనాల్లేవ్. ఎప్పుడైతే అశ్వద్థామ ట్రైలర్ బయటికొచ్చిందో అప్పడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. ఓ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అనేంతగా అంచనాలు పెరిగాయి.
దానికి తగ్గట్టుగానే నాగ శౌర్యకు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని నిర్వహించారు. ఈ సినిమాపై తనకున్న గట్టి నమ్మకాన్ని బయటపెట్టాడు. మెగా సపోర్ట్ కూడగట్టడంలో విజయవంతం అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లని అశ్వద్థామ ప్రమోషన్స్ లో భాగస్వామ్యం చేశారు. పవన్ అశ్వద్థామ కోసం వాయిస్ ఓవర్ అందించారని.. అది పరోక్షంగా గోపాల గోపాల సినిమాలోని ఆయన డైలాగ్ ని వాడుకున్నారు. ఇక మెగాస్టార్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
మొత్తంగా అశ్వద్థామపై భారీ అంచనాలు కలిగేలా చేయడంలో నాగ శౌర్య విజయవంతం అయ్యాడు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన అశ్వద్థామ ఆ అంచనాలని అందుకుందా ? అవుననే అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే అశ్వద్థామ ప్రీమియర్స్ షోస్, ఉదయం పూట ఆట పడిపోయాయ్. దీంతో అభిమానులు సినిమా టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అశ్వద్థామ కథ బాగుంది. అమెరికన్ సినిమా థ్రిల్లర్ సినిమా టైపులో ఉంది. థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్ హైలైట్ గా ఉంది. అశ్వద్థామ బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేస్తున్నారు. అంతేకాదు.. 3.5, 4 రేటింగ్ ఇస్తున్నారు.
సినిమా ప్రారంభం 30 నిమిషాలు సాదాసీదాగా సాగిందని చెబుతున్నారు. ఆ తర్వాత కథలో వేగం పుంజుకుంది. థ్రిల్లింగ్ అంశాలు క్యూ కట్టాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఐతే, సెకాంఢాఫ్ లో సినిమా కాస్త సాగదీసినట్టు అనిపించిందని చెబుతున్నారు. ఇక చెల్లెలు సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయిందని చెబుతున్నారు. నాగ శౌర్య వన్ మేన్ షో, విలన్ నటన హైలైట్ అని చెబుతున్నారు. మెహ్రీన్ నటన బాగుందని చెబుతున్నారు. మొత్తానికి అశ్వద్థామపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అశ్వద్థామ ట్విట్టర్ టాక్.. రియల్ టాక్ అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కిందే లెక్క.
#Aswathama is a very good thriller , if you like that genre go watch it. It’s gruesome though. Director followed the path taken by American thrillers and shock your wits with extreme violence. Beginning of the second half is a little dry but over all I loved it 3.75/5 #Ashwathama
— Patrick Mahomes all the way (@agnanodayam) January 31, 2020
Interesting first half 👍… Picks up after first 30 mins and goes without any deviation #Aswathama
— RC (@Perthist_) January 31, 2020
Thanks for such a good film. Even I have a sister, and I’m in US and I haven’t seen her in a while. So I kind of connected myself to the film on a different level. Also, as a film, it’s a very good thriller. It was Housefull in NJ, today. Good luck 🙂 #Aswathama @IamNagashaurya
— Harsha Vardhan (BHV) (@harsha_bhv) January 31, 2020
Pretty avg 1st half #Aswathama
— Vinay Gudapati (@gudapativinay) January 31, 2020
Just watched #Aswathama movie. @IamNagashaurya good movie bro. Good story, good acting. Would have chose a good actor for villian character. Rest all good. @Mehreenpirzada good work.
— Pratyush (@ropratyush) January 31, 2020
Blockbuster movie #Aswathama
— AR (@TheFanOfSSMB) January 31, 2020
Congratulations @IamNagashaurya for making such a good film of #Aswathama!
The mighty Father and Son duo of ‘Kuru Dynasty’ – Guru Dronacharya and his immortal son Aswathama wishes you more luck 🙂 #VoliricGames #KuruDynasty pic.twitter.com/Nr5l7XalEi
— Harsha Vardhan (BHV) (@harsha_bhv) January 31, 2020
#Aswathama first half report- Decent
👉Starts pretty slow
👉Picks up momentum after 40 mins
👉Songs are not needed at all
👉Keeps you hooked to 2nd half#NagaShaurya #AswathamaReview #aswathamatrailer #AswathamaUSPremieres— PaniPuri (@THEPANIPURI) January 31, 2020