మరోసారి మురిపించిన సితార పాప


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార పాప మరోసారి అభిమానులని మురిపించింది. ఇప్పటికే సితార సోషల్ మీడియా స్టార్ అన్న సంగతి తెలిసిందే. సితారపాప చేసే.. చిలిపి పనుల వీడియోలని మహేష్, ఆయన సతీమణి నమ్రత అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. సితార, దర్శకుడు వంశీపైడి పల్లి కూతురు ఆధ్యా కలిసి ఓ ‘ఏ&ఎస్’ యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతున్నారు. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ప్రమోషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

హీరోయిన్ రష్మిక మందనని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ఇక సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ కిక్కులో మహెష్ ఫ్యామిలీ న్యూ యార్క్ ట్రిప్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే అటే మహేష్ ఫ్యామిలీ దుబాయ్ కి చెక్కేసింది. అక్కడ మహేష్ ఫ్యామిలీ తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సితార పాప క్యూట్ లుక్ హైలైట్ గా నిలిచింది.