‘హిట్’ టీజర్ టాక్

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో ‘వాల్‌పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఆయనకి జంటగా రుహాని శర్మ నటించారు. కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానునుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

‘దిస్‌ జాబ్‌ విల్‌ డిస్ట్రాయూ విక్రమ్‌. యూ నీడ్‌ టు క్విట్‌ ది డిపార్ట్‌మెంట్‌’ అనే మాటలతో టీజర్‌ ప్రారంభమైంది. ‘డిపార్ట్‌మెంట్‌ను మాత్రం నేను వదల్లేను’ అని విశ్వక్‌ సేన్‌ చెబుతాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఓ మిస్సింగ్‌ పర్సన్‌ కేసును చేధించే క్రమంలో విశ్వక్‌సేన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ప్రధానాంశంగా తీసుకుని ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.