హోంగార్డుల‌కు కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణలో హోంగార్డుల‌ కష్టాలు తీరాయి. వీరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రూ.12 వేలుగా ఉన్న హోంగార్డుల వేత‌నాన్ని ఏకంగా రూ.20 వేలకు పెంచుతున్నట్లు ప్ర‌క‌టించారు. మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే ధ్యేయంతోనే తెలంగాణ‌ రాష్ట్రం కోసం పోరాడాం.. సాధించుకున్నమని ముఖ్యమంత్రి అన్నారు.

హోంగార్డుల వేతనాలు పెంచడంతో పాటు వారికి కానిస్టేబుల్ నియామకాల్లో 25 శాతం రిజర్వేషన్. రిజర్వ్‌డ్ కానిస్టేబుళ్ల నియామకంలో 15 శాతం రిజర్వేషన్. డ్రైవర్ల నియామకంలోనూ హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

హోంగార్డులకి సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లు చిట్టా :

* నెలవారీ జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంపు

* ప్రతీ ఏడాది నెలకు వెయ్యి చొప్పున ఇంక్రిమెంటు

* హోంగార్డులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు

* కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా హెల్త్ ఇన్సూరెన్సు

* ట్రాఫిక్ లో పనిచేస్తున్న హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగానే 30 శాతం అదనపు వేతనం

* కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్

* మహిళలకు 6 నెలల మెటర్నటీ లీవులు
పురుషులకు 15 రోజుల పెటర్నటీ లీవులు

* బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు

* అంత్యక్రియలకు ప్రస్తుతం ఇచ్చే ఐదు వేలను పదివేల రూపాయలకు పెంపు

* కానిస్టేబుళ్ల మాదిరిగానే పోలీస్ హాస్పిటల్స్ లో హోంగార్డులకు చికిత్స

* కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్ పెంపు