నాల్గో టీ20 : కివీస్ టార్గెట్ 166
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న నాల్గో టీ20లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీష్ పాండే 50 (నాటౌట్) టాప్ స్కోరర్. రాహుల్ 39, శార్దుల్ ఠాకూర్ 20, శివమ్ దూబే 12 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సోధి 3, బెన్నెట్ రెండు, శాంట్నర్, సౌథీ, స్కాట్ లు ఒక్కొ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ కోసం కోహ్లీ సేన పలు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్, షమీ, జడేజా స్థానంలో సంజూ శాంసన్, సైనీ, వాషింగ్టన్ సుందర్ టీంలోకి చేరారు. ఓపెనర్ గా వచ్చిన సంజూ శాంసన్ 8 పరుగుల వద్ద అవుటయ్యాడు. వన్ డౌన్ వచ్చిన కెప్టెన్ కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. శివవ్ దూబె 12 కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మనీష్ పాండే ఒక్కడే నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని పెంచే ప్రయత్నం చేశాడు. ఇక 166పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలని టీమిండియా బౌలర్లు బాగా శ్రమించాల్సిందే. ఎందుకంటే.. ? న్యూజిలాండ్ మైదానాలు చాలా చిన్నివిగా ఉన్నాయి.