పెళ్లి తర్వాత సమంతలో అవి పెరిగాయి.. !!

పెళ్లికి ముందు, తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులకి టచ్’లోనే ఉంటుంది స్టార్ హీరోయిన్ సమంత. పెళ్లికి ముందు ప్రియుడు నాగచైతన్య గురించి చిలిపి కబర్లు చెప్పేది. పెళ్లి తర్వాత తనలో వస్తోన్న మార్పులని లెక్కబడ్డి మరీ చెబుతోంది. పెళ్లి తర్వాత తనలో చాద‌స్తం ఎక్కువైందని చెబుతోంది.

“పెళ్లి త‌ర్వాత త‌న‌లో చాద‌స్తం ఎక్కువైంది. అంత‌కు ముందు కొద్దిగా మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు ఎక్కువైపోయింది. ప్రతి విష‌యాన్ని భూత‌ద్దంలో చూడ‌టం వృత్తిప‌రంగా మారింది. ఇది వ‌ర‌కూ ఏదైన క‌థ వింటే ఈ సీన్ బాగోలేదు అని చెప్పి ఊరుకునేదానిన‌ని, ఇప్ప‌డు క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్పేందుకు అనేక కార‌ణాలు చెబుతున్నా. అందుకే త‌న‌క న‌చ్చిన పాత్ర ఉంటేనే న‌టించేందుకు మొగ్గు చూపుతున్నా”న‌ని చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత షార్ట్ టైం హనీమూన్ కి వెళ్లొచ్చిన చై-సామ్ జంట ఈ నెలాఖరిలో లాంగ్ హనీమూన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారమ్. ఆ టూర్ విశేషాలు చెప్పకొన్నా. అక్కడికెళ్లి దిగిన ఫోటోలని మాత్రం షేర్ చేయడం సామ్స్ మరవకపోవచ్చు.