ఢిల్లీ ప్రజలకి బీజేపీ వరాల జల్లు

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ పీఠం దక్కించుకోవాలని భాజాపా ఆశపడుతోంది. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీని ఢీకొనేందుకు ఎన్నికల వ్యూహాలని అమలు చేస్తోంది. ఆప్ ఎన్నికల వూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకి దీటుగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం భాజాపా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది.
 
మేనిఫెస్టో ముఖ్య అంశాలను ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ మీడియా ముందు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ యోజన పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్‌ పంపిణి చేస్తామన్నారు. ఢిల్లీ నివసించే పేదలు గోదుమలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.