మరోసారి సంప్రదాయాన్ని పక్కన పెట్టిన నిర్మలా

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ్ మరోసారి సంప్రదాయాన్ని పక్కనపెట్టారు. గతంలో బడ్జెట్  పత్రాలను ఆర్థిక మంత్రులు బ్రీఫ్ కేస్ లో తీసుకొచ్చేవారు. ఐతే గతేడాది ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మల.. పాత సంప్రదాయాన్ని మార్చి ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీ(బాహీ ఖాటా)లో తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగించారు.
 
కేంద్ర బడ్జెట్ ను సమర్పించేందుకు బంగారు రంగు చీరలో నిరాడంబరంగా నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయం నుంచి నిర్మలమ్మ బయల్దేరారు. ఎర్రని వస్త్రంతో చుట్టిన పద్దుల సంచీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సంచీపై బంగారు రంగులో భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ చిహ్నం ముద్రకే తాళం చెవితో బ్యాగును తెరిచే వీలుంటుంది.