షాక్ : హీరోయిన్’తో పవన్ రొమాన్స్ లీకు

హీరోయిన్’తో రొమాన్స్ చేస్తున్న పవన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్ – పవన్’ల ‘అజ్ఝాతవాసి’ సినిమాలోని పిక్ అది. చిత్రబృంద ప్రమేయం లేకుండా బయటికొచ్చిన ఈ పిక్ పై నిర్మాణ సంస్థ సీరియస్ గా ఉంది. దీనిపై ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్-త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న చిత్రమిది. ‘అజ్ఝాతవాసి’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతకంటే ముందే ఈ నెల 16న టీజర్, ఈ నెల 19న సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఈ సినిమాలో .ప‌వ‌న్ సరసన కీర్తి సురేష్, అనుఇమ్మాన్యూయేల్ లు జతకట్టనున్నారు. సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.