మెగా హీరో లవ్వర్స్ డే స్లోగన్.. ఇదే !

మెగా యంగ్ హీరో సాయి తేజ్ కొత్త ఉద్యమానికి తెరలేపాడు. సోలోగాళ్లని ఏకం చేసేందుకు నడుం బిగించాడు. వారితో కలిసి ప్రేమికుల రోజుని సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కథానాయకుడుగా కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటాషా కథానాయిక. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించబోతున్నారు. ఆ రోజున సినిమా థీమ్ వీడియోని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. సాయితేజు ఓ పోస్టర్ ని వదిలారు. “సోలో సోదర సోదరీమణులారా…ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం…మన slogan ఒకటే…సోలో బ్రతుకే సో బెటర్” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్ పెట్టాడు. దాంతో పాటు సోలో గాళ్లకి నాయకత్వం వహిస్తున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్ ని పంచుకున్నారు.