కేంద్ర బడ్జెట్-2020 ముఖ్యాంశాలు

ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్-2020 వచ్చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాం. జాతి నిర్మాణంలో యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో బలోపేతమైన ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు నిర్మలా. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు :

* గత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారు.  

* ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌ ని తీసుకొచ్చాం 

* యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయి.

* జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది. ఎవరికీ నష్టం కలగలేదు. ఒకే పన్ను, ఒకే దేశం విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది

* ఏప్రిల్ నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం

* ఇన్ స్పెక్టర్ రాజ్ కు కాలం చెల్లింది. ఇందులో భాగంగా అనేక చెక్ పోస్టులు తొలగించాం. దాదాపు 10శాతం పన్ను భారం తగ్గింది. గత
రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారు.

* నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం.  

* దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందరికీ ఆవాసం. ఇప్పటివరకూ 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేశారు

* మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం.
1) న్యూఇండియా 2) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ 3) ప్రజా సంక్షేమం

* వసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకం

* కేంద్ర రుణభారం 48.7శాతానికి తగ్గింది. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తాం. 6లక్షలకు పైగా రైతులు ఫసల్  బీమా యోజనతో లబ్ది పొందుతున్నారు. సంపదను సృష్టించడమే లక్ష్యం. వ్యవసాయరంగాభివృద్ధికి 16సూత్రాల పథకం అమలు చేస్తాం