కేంద్ర బడ్జెట్ బాగుంది.. కానీ : బుగ్గన

ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్-2020 వచ్చేసింది. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రబడ్జెట్-2020ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. యేడాదిలోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఇది సామాన్యుడి బడ్జెట్ అని చెప్పారు. ఐతే, ఈ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాలకు సమకూరనున్న లబ్ఢి ఎంత అనే చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం మిక్సిడ్ టాక్ ని వినిపించింది.

కేంద్ర బడ్జెట్ బాగుందని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ హాలిడేను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాపార వృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి నిరాశ పరిచారన్నారు. అలాగని కేంద్రాన్ని పెద్దగా నినదించలేదు ఏపీ ప్రభుత్వం. కేంద్రబడ్జెట్ లో పేర్కొన్న కొన్ని మంచివిషయాలని మెచ్చుకొన్నారు బుగ్గన. రూ.5కోట్ల వరకూ చిన్న వ్యాపారాలు ఆడిట్ కు దూరంగా పెట్టడం మంచిదే. వ్యక్తిగత కొర్పొరేట్ పన్నులతో వ్యాపారాలకు వృద్ధికి చర్యలు బాగున్నాయన్నారు.