లైవ్ : ‘జాను’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ 96కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకి నేచురల్ స్టార్ నాని ముఖ్య అథితిగా హాజరుకానున్నారు.

కొద్దిసేపటి క్రితమే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభం అయింది. ఇప్పటికే అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ చిత్రం 96 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2000దశాబ్ధంలోనే బెస్ట్ ప్రేమకథా చిత్రం అనిపించుకుంది. తెలుగులోనూ ఆ మేజిక్ రిపీట్ కానుందని ఇటీవలే విడుదలైన జాను ట్రైలర్ తో అర్థమయింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విశేషాలని తాజా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెలియన్నాయి. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !