‘జాను’ జూక్ బాక్స్ వచ్చేసింది ! 

శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ 96కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేశారు. ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయి. మొదటి పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాశారు. మిగిలిన మూడు పాటలని శ్రీమణి రాశారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. జాను పాటలని మీరు వినేయండీ.. !