నాని ‘అ’లో టాలీవుడ్ అంతా.. !

నాని ‘వాల్ పోస్టర్’ బ్యానర్’పై ‘అవే’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో టాలీవుడ్ నటీనటులంతా కనిపించేలా ఉన్నారు. ఇప్పటికే నాని ‘అ’ నుంచి నిత్యామీన, అవసరాల శ్రీనివాస్, ఇషాల ఫస్ట్ లుక్ లు వచ్చేశాయి. తాజాగా, స్పస్పెన్స్ తో కూడిన రెజీనా లుక్ ని రిలీజ్ చేశారు. సినిమాలో ఆమెది మ్రోడన్ యువతి పాత్రని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే శ‌రీరంపై చెట్టు వేళ్లు ఉన్న టాటూ క‌నిపిస్తున్న‌ది.

ఇంకా ఈ సినిమా నుంచి కాజల్, నాని, రవితేజ.. తదితరుల లుక్స్ రావాల్సి ఉంది. ఐతే, సినిమాలో ఇంకెంత మంది కనిపించబోతున్నారన్న విషయాన్ని చెప్పడం లేదు. వరుసగా ఫస్ట్ లుక్స్ ని వదులుతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు నాని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, నాని తాజా చిత్రం ‘ఎం.సి.ఎ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.