నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరనో వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తయింది. కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇన్నాళ్లు కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల కోసం బ్లడ్ షాపింల్స్ ని పూణెకి పంపించేవారు. ఐతే, రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కిట్లను కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపించింది.

ఈ నేపథ్యంలో ఈరోజు నుంచే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రోజుకి 30మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు. నగరంలోని ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రిలో వారిని ప్రత్యేక సదుపాయాల నడుమ వైద్యుల పరిశీలనలో ఉంచారు.

ఇక చైనాలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 300దాటింది. వేళ సంఖ్యలో అనుమానితులు ఆసుపత్రిలో చేరారు. భారత్ తో పాటు 20 దేశాలకి కరోనా వైరస్ పాకింది. భారత్ లో కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళలోనే రెండో కరోనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కరోనా పట్ల అప్రమత్తయింది. రాష్ట్రాలకి కరోనా నిర్థారణ కిట్స్ ని పంపిస్తోంది.