విజయశాంతి మళ్లీ సినిమాలకి దూరం.. ఎందుకంటే ?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ-ఎంటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. ఇందులో ప్రొఫెసర్ భారతి పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సరిలేరు షూటింగ్ సమయంలోనే ఇకపై విజయశాంతి వరుస సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే కథలు వింటున్నారనే వార్తలు వినిపించాయి. సినిమా ప్రమోషన్స్ లోనూ పవర్ ఫుల్ కథ దొరికితే విజయశాంతిగారు నటిస్తారని మహేష్ అన్నారు. ఈ నేపథ్యంలో రాములమ్మ మరోసారి తెరను ఏలడం ఖాయం అనుకొన్నారు.
 
కానీ అభిమానుల ఆశలు, అంచనాలని రాములమ్మ తలక్రిందులు చేస్తూ.. కీలక ప్రకటన చేశారు. ఇక సినిమాలకి సెలవ్. మళ్లీ రాజకీయాల్లో బిజీకాబోతున్నా అనే అర్థం వచ్చేలా వరుస ట్విట్లు చేశారు.  ‘సరిలేరు మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానంలో కళ్లుకుల్ ఇరమ్ కిలాడి కృష్ణుడు (1979) నుంచి.. నేటి సరిలేరు నీకెవ్వరు (2020) వరకు గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’

‘ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు.. మీ విజయశాంతి’ అంటూ విజయశాంతి వరుస ట్విట్ చేశారు.

వాస్తవానికి రాజకీయంగానూ విజయశాంతి అలర్ట్ గా లేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా స్పందించడం తప్ప. అలాంటిది.. మళ్లీ రాజకీయాల్లో బిజీ. సినిమాలకి సెలవు అని రాములమ్మ ఎందుకు ప్రకటించినట్టు? అంటే.. ఆమె పీసీసీ చీఫ్ పదవి రానుందనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత టీ పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికకి కసరత్తు జరుగుతోంది. ఈ జాబితాలో విజయశాంతి ముందున్నారని సమాచారమ్. ఇదీగాక.. విజయశాంతి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరబోతున్నారు. అదే జరిగితే.. టీ భాజాపాలో ఆమె కీలక పాత్రలో పోషించబోతున్నారనే ప్రచారం ఉంది. మొత్తానికి.. పొలిటికల్ గా బంపర్ ఆఫర్ రావడంతోనే ఇకపై సినిమాలు చేయలేనని రాములమ్మ ట్విట్ చేసి ఉంటారని చెప్పుకొంటున్నారు.