బాలీవుడ్ దర్శకుడు నీరజ్ వోరా కన్నుమూత
బాలీవుడ్’లో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ నటుడు, రచయిత, దర్శక-నిర్మాత నీరజ్ వోరా (54) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2016 అక్టోబర్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ఉదయం ముంబైలో ఆయన తుది శ్వాస విడిచినట్టు సన్నిహితులు తెలిపారు.
ఆమీర్ ఖాన్ “రంగీలా” సినిమాతో రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు నీరజ్ వోరా. ఆ తర్వాత నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. 2000లో విడుదలైన “కిలాడీ 420” సినిమాతో దర్శకుడిగా మారాడు. వెల్కం బ్యాక్, బోల్బచ్చన్, ధడకన్ తదితర చిత్రాల్లో వోరా చిన్న పాత్రల్లో నటించారు. వోరా మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.