హీరోయిన్ కి కరోనా వైరస్
చైనాలో భయపటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. మనదేశంలోనూ కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. కేరళలో ఇప్పటికే మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బాలీవుడ్ నటి రాణీ ఛటర్జీ కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు స్వయంగా రాణీ ఛటర్జీ తెలిపారు. నీరసంగా ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతేకాదు.. కరోనా వైరస్ లక్షణాలు ఎదుర్కొంటున్నారేమోననే అనుమానాలని ఆమె వ్యక్తం చేశారు. గత10 రోజులుగా జ్వరం, జలుబు, తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. దీంతో రాణీ ఛటర్జీ కరోనా వైరస్ సోకిందనే ప్రచారం మొదలైంది. మంచి చికిత్స తీసుకోవాలని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.