‘అశ్వద్థామ’ నాలుగు రోజుల కలెక్షన్స్
‘అశ్వద్ధామ’గా గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఈ చిత్రానికి నాగ శౌర్య సొంతగా కథని అందించారు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. నాగ శౌర్యకి జంటగా మెహ్రీన్ నటించింది. నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మించింది. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన అశ్వద్థామ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. నాలుగురోజుల్లో రూ. 11.95కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది.
ఈ సినిమా కోసం రూ. 15కోట్లు ఖర్చు చేశారు. ఐతే, సినిమా ట్రైలర్ బాగుంటడంతో.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపుగా 16.2 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లు కాగా, సాటిలైట్, డిజిటల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి 6.20 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం మొదటివారంలోనే తిరిగి రానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాలు రాకున్నా.. నష్టాలని మాత్రం అశ్వద్ధామ తీసుకురాదని చెబుతున్నారు. మరోవైపు, సినిమా సక్సెస్ టూర్ ని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు గుంటూరు, ఓంగోలులో అశ్వద్థామ చిత్రబృందం సందడి చేయనుంది.