అమరావతి తీర్మాణంపై భాజాపా క్లారిటీ
ఏపీ రాజధాని అంశాన్ని కేంద్రం తేల్చేసిన సంగతి తెలిసిందే. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం ఉండదు. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని మంగళవారం లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఐతే, గతంలో అమరావతియే రాజధానిగా కొనసాగాని ఏపీ భాజాపా తీర్మాణం చేసింది. ఇప్పుడు ఆ తీర్మానికి వ్యతిరేకింగా లోక్ సభలో ప్రకటన చేసిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై బీజేపీ నేత జీవీఎల్ స్పందించారు.
ఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రాజ్యాంగబద్ధంగా పని చేస్తుందన్నారు. రాజధానిపై కేంద్రం ఇంత స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో రాజధాని కొనసాగాలని తాము రాజకీయ తీర్మానం చేశామన్నారు. కానీ అమరావతిలో అక్రమాలు జరగలేదని చెప్పలేదన్నారు. రైతులు భూములు ఇచ్చారు కాబట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్రం రాజధానిని మార్చుకుని.. కేంద్రానికి సమాచారం ఇస్తే అప్పుడు కేంద్రం ఆ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు.
సింపుల్ గా చెప్పాలంటే.. అమరావతియే ఏపీ రాజధానిగా ఉండాలని భాజాపా భావిస్తోంది. కానీ, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుని ఆపలేం. అది రాష్ట్ర పరిధిలోని అంశం. విశాఖ రాజధానిగా కొలువుదీరే వరకు అమరావతియే ఏపీ రాజధాని అని జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఇది భాజాపా పాత పాటే. కానీ కాస్త కొత్తగా పాడే ప్రయత్నం చేశారు జేవీఎల్.