సంక్షేమ పథకాల్లో అవినీతిపై కేకే కామెంట్స్
తెరాస ఎంపీ కె. కేశవరావు తీరు వెరైటీ ఉంటుంది. ఆయన అన్నీ చెబుతారు. కానీ ఏదీ అర్థంకాదు. అదే ఆయన ప్రత్యేకత. తాజాగా ఆయన తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతి గురించి మాట్లాడారు. ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన ఆయన తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదనే కామెంట్స్ చేశారు. వాస్తవానికి తెలంగాణ సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఏ కుంభకోణం బయటికి రాలేదు.
మరీ.. కేకే ఎందుకు అవినీతిని ప్రస్తావించినట్టు అంటే.. ? ఆయన రాజకీయ వ్యూహాం ఆయనకి ఉంటుందని అంటున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఆధార్‌ను పెట్టాం. సాంకేతికతను వినియోగించి మోసాలకు వీలు లేకుండా చేశామన్నారు కేకే. అంతేకాదు.. నిజామాబాద్‌కు సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వరంగల్‌లో ఉన్న బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌కు తరలించొద్దన్నారు కేకే కోరారు.