తొలి వన్డేలో భారత్ ఓటమి
టీమిండియా విజయ యాత్రకు బ్రేక్ పడింది. టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, వన్డే సిరీస్ లో ఆ జోరుని కొనసాగించలేకపోయింది. హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డే కోహ్లీ సేన ఓటమిపాలైంది. కివీస్ ముందు 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
348 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 48.1 ఓవర్లలోనే 348 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు రాజ్ టేలర్ 109 పరుగులతో నాటౌట్ గా నిలవగా, హెన్రీ నికోలస్ 78, టామ్ లాథమ్ 69, మార్టిన్ గఫ్తిల్ 32 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒకటి, మహమ్మద్ షైనీ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
అంతకుముందు టీమిండియా 347/4 భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 103, కేఎల్ రాహుల్ 88, విరాట్ కోహ్లీ 51, మయాంక్ అగర్వాల్ 32, జాధవ్ 26, పృథ్వీ షా 20 పరుగులతో రాణించారు.