‘డిగ్రీ కాలేజ్’ దర్శక-నిర్మాతలపై పోలీస్ కేసు
‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి గానూ జాతీయ అవార్డుని అందుకున్నాడు నరసింహ నంది. ఈయన దర్శకత్వంలో ‘హైస్కూల్’, ’కమలతో నా ప్రయాణం’ , ‘లజ్జ’ సినిమాలొచ్చాయ్. ఆయన తాజా సినిమా ‘డిగ్రీ కాలేజ్’. వరుణ్, దివ్యరావు హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీనివాసరావు నిర్మత. ఈ వారమే (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా దర్శక-నిర్మాతలపై ఎస్ ఆర్ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డిగ్రీ కాలేజ్ సినిమాకు సంబంధించిన అశ్లీలంగా ఉన్న పోస్టర్లను మైత్రివనమ్ పరసర ప్రాంతాల్లో అతికించారు. వీటిపై విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్రావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.