జర్నలిస్టుల సంక్షేమానికి బన్నీ సాయం
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సాయం చేశారు. ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికి గాను 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇకపై ముందు కూడా జర్నలిస్టుల సంక్షేమానికి సాయం చేస్తానని బన్నీ మాటిచ్చాడు. బుధవారం ‘ఫిల్మ్ న్యూస్క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ సభ్యులు బన్నీని కలిశారు. ఈ సందర్భంగా రూ.10లక్షల విరాళాన్ని బన్నీ జర్నలిస్టుల సంక్షేమానికి అందించారు.
త్రివిక్రమ్-బన్నీ కాంబో తెరకెక్కిన అల.. వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా నాన్ బాహుబలి రికార్దులన్నీ బ్రేక్ చేసింది. ఈ హిట్ కిక్కులో ఉన్న బన్నీ అందరికీ సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో తనని కలవడాకి వచ్చిన ఫిలిం జర్నలిస్టులని బన్నీ ఖుషి చేశారు. ఇక బన్నీ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండనుంది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక మందన నటించనుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
I heart fully thank the Film Newscasters Association of Electronic Media for conveying their wishes for our success . I really appreciate that they gave me a plant. Very thoughtful. Humbled pic.twitter.com/4XwfYUc0IM
— Allu Arjun (@alluarjun) February 5, 2020