‘ఆర్ఆర్ఆర్’ కథని లీక్ చేసిన బాహుబలి నిర్మాత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలియాలంటే ఆయన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ ని అడగాలి. పవన్ ఫ్యాన్స్ ఒత్తిడితో ఆయన అభిమానులు ఖుషి అయ్యే ముచ్చట్లు ఒకట్రెండు సార్లు త్రివిక్రమ్ చెప్పిన సందర్భాలున్నాయి. మరీ.. దర్శకధీరుడు రాజమౌళి, ఆయన చేస్తున్న సినిమాల గురించి తెలియాలంటే ఎవరిని అడగాలి. ఆయన స్నేహితుడు, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డని అడగాలని ఓ అభిమాని ఫిక్సయ్యాడు. అడిగేశాడు కూడా.

దర్శకధీరుడు రాజమౌళికి మంచి స్నేహితులైన మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ ఏమిటని తెలుసుకున్నారా ? ఒకవేళ మీకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ తెలిస్తే.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా ఎలా ఆడబోతుందని మీ అభిప్రాయం ? అంటూ శోభు యార్లగడ్డని ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశాడు ఓ నెటిజన్. అతనికి శోభు యార్లగడ్డ రిప్లై ఇచ్చారు. ”ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కథ నాకూ తెలియదు. నిజం చెప్పాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌కి ఒక్కరోజు మాత్రమే వెళ్లాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తప్పకుండా ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకుంటుందని నేను నమ్మకంగా చెప్పగలను’ అని శోభూ తెలిపారు.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌.. కొమరంభీంగా, ఆయనకి జోడిగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన తారలు సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.