ఫాస్ట్‌ట్రాక్ తీర్పులపై కేటీఆర్ హ్యాపీ
తెలంగాణలో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంచి ఫలితాలని ఇస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సమత, యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో వరుస హత్యలు, వరంగల్ జిల్లాలో చిన్నారిపై హత్యాచారం కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సత్వర విచారణ జరిపి దోషులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక స్పందించారు.
మహిళలు, చిన్నారులకు సంబంధించిన మూడు దారుణ కేసుల్లో ఆరు నెలల్లోపే తీర్పులు ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందితలకూ ఉరిశిక్ష విధించారని గుర్తు చేశారు. ఆయా కేసుల అంశంలో సత్వర న్యాయం జరిగేలా ప్రయత్నించిన న్యాయ, హోంశాఖ అధికారులతో పాటు న్యాయవ్యవస్థను మంత్రి కేటీఆర్ అభినందించారు.
Within a span of six months, fast-track courts in Telangana have delivered justice in 3 ghastly crimes against women. All 5 accused have been sentenced to capital punishment
Kudos to the Law & Home Dept officials & Judiciary who have toiled hard to ensure quick justice 👏👍
— KTR (@KTRTRS) February 7, 2020