వాల్ కొటేషన్’కు హాలీవుడ్ ఫిదా

ది వాల్‌ రాహుల్ ద్రావిడ్ సహనానికి ప్రతీక. ఆ ఓర్పు, నేర్పుతోనే టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అండర్ – 19 కోచ్ గా తన ప్రత్యేకతని చూపిస్తున్నారు. “ఆటగాడు ప్రతీకారం కోసం కాదు.. గౌరవ మర్యాదల కోసం ఆడాలి ” అని ద్రావిడ్ చెబుతున్నాడు. ద్రావిడ్ చెప్పిన ఈ కొటేషన్ కి డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌ స్టార్‌, హాలీవుడ్‌ హీరో జాన్‌ సీనా పీదా అయిపోయాడు.

తాజాగా, సీసా ద్రావిడ్‌ కొటేషన్‌ “ఆటగాడు ప్రతీకారం కోసం కాదు.. గౌరవ మర్యాదల కోసం ఆడాలి”ను తన న్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పైగా తన ఫోటోలకు వివరణ కోరవద్దంటూ పేర్కొన్నాడు. దీంతోపాటు.. కపిల్‌, అమితాబ్‌లు కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా సీనా పోస్టు చేయటం విశేషం. చూస్తుంటే సీసా మన వాల్ ద్రావిడ్ కి వీరాభిమానిలా కనిపిస్తున్నాడు.