సీఎం కేసీఆర్ బావ రాజేశ్వర్ రావు కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరర్ రావు (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఓల్డ్‌ అల్వాల్‌ మంగాపురిలో రాజేశ్వరరావు పార్థీవ దేహానికి శనివారం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను  ఓదార్చారు. ఈ సాయంత్రమే అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు దగ్గరుండి చూసుకొంటున్నారు. పర్వతనేని రాజేశ్వరరావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల. బావ అంత్యక్రియలకి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, తెరాస శ్రేణులు హాజరుకానున్నారు.