సీఏఏ వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ తీర్మాణం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొలిసారి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. సీఏఏని వ్యతిరేకిస్తున్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ నే ప్రకటన చేశారు. తెలంగాణలో దాన్ని అమలు చేయబోమని కూడా తెలిపారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు.
 
ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసిసింది. ఈ నిర్ణయానికి సహకరించిన సభ్యులకు  మేయర్‌ బొంతు రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి మినీ ఇండియాను తలపిస్తోందని రామ్మోహన్ అన్నారు.

అంతకుముందు మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఏర్పాటు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలోనూ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం దన్నుగా నిలిచింది. ఐతే, సీఏఏకి మాత్రం మద్దతు ఇవ్వాలేమని సీఎం కేసీఆర్ ఖరాఖండిగా చెప్పేశారు. మరో తెలుగు రాష్ట్రం ఏపీ కూడా సీఏఏని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.