కేసీఆర్’కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
సీఏఏతో దేశ పౌరులకు జరుగుతున్న అన్యాయమేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కిషన్ రెడ్డి. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంత్ రవిదాస్ 621వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని, చొరబాటుదారులకు కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శరణార్థులు వేరు.. చొరబాటుదారులు వేరని వివరించారు. పాకిస్థాన్ పౌరుల కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్నారా ? అని ప్రశ్నించారు.
కుటుంబాల కోసం భాజపా పనిచేయడం లేదని, దేశం కోసం పనిచేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, బౌద్దులు, సిక్కులకు కనీస హక్కులు కల్పించడం లేదన్నారు. ఆ మూడు దేశాల్లో అణచివేతకు గురైన వారు భారత దేశానికి శరణార్థులుగా వచ్చారని తెలిపారు. అలాంటి వారికోసమే సీఏఏ తీసుకొచ్చామని కిషన్ రెడ్డి అన్నారు.