బంగ్లాదేశ్’దే అండర్-19 ప్రపంచకప్
మెగా టోర్నీలో ఆమాతం అద్భుతంగా రాణించిన యువ భారత్ ఆఖరి మొట్టు మీద బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో బంగ్లాదేశ్ పై ఓటమి పాలైంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ భారత్ బ్యాటింగ్ లో తడబడింది. కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది.
కానీ ఈ స్కోర్ ని కాపాడుకొనేందుకు గట్టిగానే పోరాడింది. 50 పరుగుల వరకు బంగ్లా ఒక్క వికెట్ కోల్పోలేదు. దానికి తోడు బంగ్లాకి ఎక్స్ ట్రాల రూపంలోనే 33 పరుగులొచ్చాయ్. దానికితోడు వర్షం అడ్డంకితో డక్ వర్త్ లూయిస్ బంగ్లాకి బాగా కలిసొచ్చింది. దాంతో రవి బిష్ణోయ్(4), సుశాంత్ మిశ్రా(2), జైశ్వాల్ (1) వికెట్ తో శ్రమించినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(88; 121 బంతుల్లో 8×4, 1×6), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ(38; 65 బంతుల్లో 3×4) రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరు చేసింది.