పూజాని ఫాలో అవుతున్న ఫాలో


పూజా హెగ్డే.. ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతోంది. వరుసగా స్టార్ హీరోలతో  జతకడుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లతో జతట్టింది. వీరితో రెండో రౌండ్ వేస్తోంది. ఐతే, పూజా అంత ఈజీగా ఈ స్థాయికి చేరలేదు. కెరీర్ మొదట్లో సినిమా కష్టాలని ఎదుర్కొంది. 

‘ముకుందా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పూజా హెగ్డే. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయ్. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా.. బాలీవుడ్ లో భారీ సినిమా ‘మెహంజదారో’పై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకుంది. కానీ, ఆశలు ఫలించలేదు. మెహంజదారో ప్లాప్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ కి తిరిగొచ్చి చేసిన డీజే సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక డీజే తర్వాత పూజాకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేడు. వరుసగా మహేష్, ఎన్ టీఆర్, ప్రభాస్ లతో సినిమాలు పడ్డాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఐతే, సినిమా ఫంక్షన్స్ లో పూజా ధరించే డ్రెస్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఇప్పుడు ఆమె స్టయిల్ ని రాశీఖన్నా ఫాలో అవుతోంది.

అచ్చం పూజా డ్రెస్సుల స్టయిల్ లోనే ఇటీవల రాశీ కనిపిస్తోంది. వరల్డ్ ఫేమస్ లవ్వర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గానూ రాశీఖన్నా రెడ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే క్లీవేజ్ షో చేసింది. ఐతే, ఈ స్టయిల్ లో గతంలో పూజా సందడి చేసింది. ఆ తాలుకు ఫోటోలు, అందాలని అభిమానులు ఇంకా మరిచిపోలేదు. ఇప్పుడు రాశీ అలాంటి డ్రెస్ లోనే కనిపించడంతో రాశీ.. పూజాని ఫాలో అవుతుందని చెప్పుకొంటున్నారు.