ఢిల్లీలో సామాన్యుడిదే హవా
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్నాయ్. ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాట్ పోల్స్ కాబోతున్నాయని ఫలితాల ట్రెండుని చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 51 స్థానాల్లో, భాజాపా 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేదు. దీంతో.. ఢిల్లీ పీఠం మరోసారి సామాన్యుడిదే అని అర్థమవుతోంది.
మూడోసారి అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. ఐతే, 2005 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ హవా తగ్గిందనే చెప్పాలి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాల్లో విజయ సాధించింది. బీజేపీ కేవలం 3 స్థానాలకి మాత్రమే పరితమైంది. ఐతే, ఈ సారి అమ్ ఆద్మీ పార్టీ 50లోపు స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు, భాజాపా 3 స్థానాల నుంచి దాదాపు 20 స్థానాల వరకు ఎగబాకేలా కనిపిస్తోంది.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఓపెన్ టాప్ జీప్ సిద్ధం చేశారు. దానిని అందంగా అలంకరించారు. మరికొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఆప్ సంబరాలు మొదలు కానున్నాయి.