బ్రేకింగ్ : గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ ఆత్మాహత్యాయత్నం
గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ కేసుల వ్యవహారంలో ముగ్గురు డాక్టర్లపై వైద్య ఆరోగ్య శాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో డాక్టర్ వసంత్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన డాక్టర్ వసంత్ పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్య ప్రయత్నం చేశారు.
పెట్రోల్ పోసుకొని మీడియా ముందు తన బాధని వెళ్లగక్కారు. ఆసుపత్రిలో అవినీతి జరుగుతోంది. మందులు లేవు. ఏ చిన్న సంతకం కావాలని డబ్బులు ఇవ్వాల్సిందేనని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అంతేకాదు.. గాంధీ సూపరెంటెడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావాలి.. లేదంటే నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటానని డాక్టర్ వసంత్ బెదిరిస్తున్నారు. పోలీసులు, తోటి సిబ్బంది వసంత్ ని వారిస్తున్నా వినడం లేదు.