TS Mirchi స్పెషల్ : G.K-1512

చరిత్రలో ఈరోజు – 15 డిసెంబర్

జననాలు :

* 1914 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు

* 1925 :ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత (మ.1997)

* 1933 : వాసిరెడ్డి సీతాదేవి, ప్రసిద్ధ రచయిత్రి.(మ.2007)*

* 1933 : బాపు, ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.2014)

* 1939 : నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు (మ.1975)

* 1945 : విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు (మ.2017)జి సైదేశ్వర రావు

* 1960 : మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్’లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

* 1966 : వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర

మరణాలు :

* 1950 : సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.

* 1952 : పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.

* 1974 : కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు(జ.1907)

* 1985 : శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)

* 2014 : చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (జ.1974)

—————————————————————————————————————————————————————————————————————-

వివిధ ప్రదేశాలు – నామాంతరాలు

◆ సూర్యుడు ఉదయించే దేశం : నార్వే

◆ ఆకాశశిఖరాల నగరం : ఆక్స్‌ఫర్డ్‌ (బ్రిటన్‌)

◆ ఆకాశ హార్మ్యాల నగరం : న్యూయార్క్‌ (అమెరికా)

◆ ఆడ్రియాటిక్‌ సముద్రరాణి : వెనిస్‌ (ఇటలీ)

◆ నీలి పర్వతాలు : నీలగిరికొండలు (భారతదేశం)

◆ స్వర్ణదేవాలయం నగరం : అమృత్‌సర్‌ (భారతదేశం)

◆ రాజభవనాల నగరం : కోల్‌కతా (భారతదేశం)

◆ స్వర్ణసింహద్వార నగరం : శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)

◆ సప్తగిరుల నగరం : రోమ్‌ (ఇటలీ)

◆ దివ్యద్వారాల నగరం : వాషింగ్‌టన్‌ (డి.సి)

◆ యూరప్‌ కాక్‌పిట్‌ : బెల్జియం

◆ చీకటి ఖండం : ఆఫ్రికా

◆ సామ్రాజ్య నగరం : న్యూయార్క్‌ (అమెరికా)

◆ అనశ్వర నగరం : రోమ్‌ (ఇటలీ)

◆ నిషేధ నగరం : లాసా, టిబెట్‌

◆ భారతదేశ ఉద్యానవనం : బెంగుళూరు

◆ భారతదేశ సింహద్వారం : ముంబై

◆ మహాత్తర శ్వేతమార్గం : బ్రాడ్వే (న్యూయార్క్‌)

◆ ఇంగ్లాండ్‌ దేశ ఉద్యానవనం : కెంట్‌

◆ నైలునదీ వరప్రసాదం : ఈజిప్టు

◆ గ్రానైట్‌ నగరం : అబర్టీన్‌ (బ్రిటన్‌)

◆ కల్లోల సముద్రం : అట్లాంటిక్‌ మహాసముద్రం

◆ పవిత్రభూమి : పాలస్తీనా

◆ హెర్మిట్‌ రాజ్యం : కొరియా

◆ రత్నాల దీవి : బ్రహ్రైన్‌

◆ లవంగాల దీవి : మడగాస్కర్

◆ మధ్యధరా ప్రాంతపు తాళపుచెవి : జీబ్రాల్డర్‌

◆ బంగారు గొర్రెల దేశం : ఆస్ట్రేలియా

◆ మాపుల్‌ చెట్ల దేశం : కెనడా

◆ సహస్ర సరస్సుల దేశం : ఫిన్‌లాండ్‌

◆ సూర్యుడు ఉదయించే దేశం : జపాన్‌

◆ ఉదయ ప్రశాంత దేశం : కొరియా

◆ పంచనదుల ప్రాంతం : పంజాబ్‌ (భారతదేశం)

◆ రొట్టెల దేశం : స్కాట్‌లాండ్‌

◆ తెల్ల ఏనుగుల దేశం : థాయ్ లాండ్‌

◆ పిడుగుల దేశం : భూటాన్‌

◆ నెవర్‌ నెవర్‌ లాండ్‌ : ప్రైరీస్‌ (నార్త్‌ ఆస్ట్రేలియా)

◆ పింక్‌సిటీ : జైపూర్‌

◆ ఐరోపా ఖండ ఆటస్థలం : స్విట్జర్లాండ్‌

◆ అరేబియా సముద్రపురాణి : కొచ్చిన్‌ (భారతదేశం)

◆ క్వాకర్‌ సిటీ : ఫిలిడెల్పియా (అమెరికా)

◆ నదుల దుఖఃదాయిని : బ్రహ్మపుత్ర (భారతదేశం) (రివర్‌ ఆఫ్‌ సారో)

◆ బెంగాల్‌ దుఃఖదాయిని : దామోదర్‌ నది

◆ చైనా దుఃఖదాయిని : హువాంగ్‌ హో

◆ భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట : కేరళ

◆ ఐరోపా రోగి : టర్కీ

◆ తూర్పు ప్రాంత వెనిస్‌ నగరం : కొచ్చి (భారతదేశం)

◆ ఉత్తర ప్రాంత వెనిస్‌ నగరం : స్టాక్‌ హోమ్‌ (స్వీడన్‌)

◆ వైట్‌సిటీ : బెల్‌గ్రేడ్‌ (యుగోస్లేవియా)

◆ వాయునగరం : చికాగో (అమెరికా)

◆ తెల్లవాడి సమాధి : గినియా తీరం

◆ ప్రపంచ మిక్కిలి ఏకాంత ద్వీపం : ట్రిస్టన్‌ డాచున్హా

◆ ప్రపంచ రొట్టెల బుట్ట : ఉత్తర అమెరికా ఖండంలోని ప్రయరీలు

IMP CA BITS

1. రాష్ట్రపతి ఎన్నికలలో “రాంనాథ్ కోవింద్” ఎవరిని ఓడించారు?

A : మీరాకుమార్

2. “భారత రక్షణశాఖ మంత్రిగా” ఇటీవల పదవి పొందిన మహిళ ఎవరు?

A : నిర్మలా సీతారామన్

3. “పసుపు పంట” సాగు వైశాల్యంలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది?

A : తెలంగాణ

4. తెలంగాణ రాష్ట్ర “ఒంటరి మహిళ” పెన్షన్ పథకం కింద అర్హులకు ఇచ్చే పెన్షన్ ఎంత?

A : రూ.1000/-

5. “మైనారిటీ యువతుల వివాహానికి” రూ.51వేలు సహాయం అందించాలని కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ నిర్ణయించిన పథకం పేరేమిటి?
A : *షాదీ షగున్

6.2017 సంవత్సరపు “జ్ఞాన్ పీఠ్ అవార్డు” ఎవరికి లభించింది?

A : కృష్ణా సోబతీ

7. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన “భారత ఫాస్ట్ బౌలర్” ఎవరు?

A : ఆశిష్ నెహ్రా

8. “ఆసియా మహిళా హాకీ కప్” ఫైనల్లో భారత జట్టు ఎవరిపై విజయం సాధించింది?

A : చైనా పై

9. ఇటీవల మరణించిన “అబ్దుల్ రహమాన్ బిశ్వాన్” ఏ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు?

A : బంగ్లాదేశ్

10. ఇటీవల వార్తల్లోకి వచ్చిన “ఊంచాహార్ NTPC” ఏ రాష్ట్రంలో కలదు?

A : ఉత్తర ప్రదేశ్

11. ఫస్టు క్లాస్ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారతీయ క్రికెటర్ ఎవరు?

A : ఛటేశ్వర్ పుజారా

12. వన్డే చరిత్రలో ఒక బ్యాట్స్ మెన్ అత్యధిక రేటింగ్(889 పాయింట్లు) పొందిన క్రికెటర్ ఎవరు?

A : విరాట్ కోహ్లీ

13. నాలుగు సముద్రాల గుండా సాగే ఓల్వో ఓసియన్ రేస్ ఎక్కడి నుండి ప్రారంభమైంది?

A : స్పెయిన్ లోని లికాంబే

14. అఖాడా పుస్తక రచయిత ఎవరు?

A: సౌరభ్ దుగ్గల్

15) ప్రపంచంలో అతిచిన్న అయస్కాంతం తయారుచేసిన సంస్థ ఏది?

A : IBM సంస్థ

Physics – కాంతి

1) క్రిందివానిలో స్వయంప్రకాశం కానిది ?

జ : చంద్రుడు

2) సూర్యుని నుండి కాంతి భూమిని చేరుటకు పట్టుకాలం ?

జ : 8 ని. 17 సె.

3) వజ్రం యొక్క వక్రీభవన గుణకం ?

జ : 2.42

4) కాంతి విధ్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుందని చెప్పినవారు ?

జ : మాక్స్ వెల్

5) కాంతితీవ్రత కు ప్రమాణాలు ?

జ : కాండెలా

6) క్రిందివానిలో ప్రాధమిక రంగు కానిది. ?

జ : YELLOW

7) ఎండమావులు కనిపించుటకు కాంతి యొక్క ఏ గుణం కారణం?

జ : సంపూర్ణాంతర పరావర్తనం

8. 1 పారాసిక్ =?

జ : 3.26 కాంతి సంవత్సరాలు

9. క్రిందివానిలో పాక్షిక పారదర్శక పదార్ధం ఏది?

జ : గరుకు గాజు

10. కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించినది ?

జ: హైగెన్స్

11) నీటి తొట్టిలో ఉంచిన కడ్డీ వంగినట్లు కనిపించుటకు కారణం ?

జ : వక్రీభవనం

12. ఎరుపు నీలం కలయిక వల్ల ఏర్పడే రంగు ?

జ : ముదురుఎరుపు

13. డ్రైవర్ల పక్కన అద్దం (side mirror) గా ఉపయోగించునది ?

జ : కుంభాకార దర్పనం

14. పెరిస్కొప్ లో సమతల దర్పణాన్ని ఎంత కోణంతో అమరుస్తారు ?

జ : -45°

15. కుంభాకారకటకం గుండా చూసిన వస్తువులు __?

జ : పెద్దగా కనిపిస్తాయి

GK BITS

1) “ఉక్కు మనిషి” అని ఎవరికి బిరుదు?

A : సర్ధార్ వల్లభాయ్ పటేల్

2) “సర్ధార్ వల్లభాయ్ పటేల్” ఎక్కడ జన్మించారు?

A : గుజరాత్ లోని నాడియార్ లో.

3) “ఏ కాంగ్రెస్ సదస్సుకు” సర్ధార్ అధ్యక్షత వహించారు?

A : 1931 కరాచి సదస్సు.

4) “జవహర్ లాల్ నెహ్రూ” మంత్రివర్గంలో సర్ధార్ చేపట్టిన మంత్రిత్వ శాఖ ఏది?

A : హోం శాఖ

5) సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో “భారత రత్న” అవార్డు ప్రకటించింది?

A : 1991.

ఇటీవల నియమకాలు

1. బీహార్ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు?

2. అస్సాం కొత్త గవర్నర్గా నియమితులయ్యారు ఎవరు?

3. కొత్త ఎన్నికల కమీషనర్గా ఎవరు నియమితులయ్యారు?

4. పాకిస్తాన్కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

5. భారత వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఎవరు?

6. రైల్వే బోర్డ్ యొక్క కొత్త ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యార

7. కజాఖ్స్తాన్ రిపబ్లిక్ కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

8. భారతదేశ 45 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఎవరు?

9. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) చీఫ్గా నియమితులయ్యారు ఎవరు?

10. ఇండోనేషియాకు భారత రాయబారిగా నియమితులయ్యారు ఎవరు?

11. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (ఐటిబిపి) ఎవరు?

12. భారత అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?

13. NITI అయోగ్ వైస్ ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?

14. ఫేస్బుక్ ఇండియా MD గా ఎవరు నియమిస్తారు?

15. సీబీఎస్ఈ యొక్క కొత్త ఛైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?

16. ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?

17. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?

18. టాటా కాపిటల్ యొక్క MD & CEO గా నియమితులయ్యారు ఎవరు?

19. జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ కొత్త సిఈఓగా నియమితులయ్యారు ఎవరు?

20. SIDBI యొక్క సిఎండిగా నియమితులయ్యారు ఎవరు?

జవాబులు :

1. సత్య పాల్ మాలిక్
2. ప్రొఫెసర్ జగదీష్ ముఖి
3. సునీల్ అరోరా
4. అజయ్ బిసారీ
5. వెంకయ్య నాయుడు
6. అశ్వని లోహని
7. శ్రీ ప్రభాత్ కుమార్
8. జస్టిస్ దీపాక్ మిశ్రా (J S ఖేహార్ స్థానంలో)
9. సంజయ్ కుమార్
10. ప్రదీప్ కుమార్ రావత్
11. శ్రీ ఆర్ కె పచ్నంద
12. కే కె వేణుగోపాల్ (భర్తీ ముకుల్ రోహత్గి)
13. ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ (అరవింద్ పనగారియా స్థానంలో)
14. సందీప్ భూషణ్
15. అనితా కర్వల్ (రాజేష్ కుమార్ చతుర్వేది స్థానంలో)
16. అనుపమ్ ఖేర్ (గజేంద్ర చౌహాన్ స్థానంలో)
17. వివేక్ గోయెంకా (భర్తీ రియాద్ మాథ్యూ)
18. రాజీవ్ సభర్వాల్
19. వినయ్ డుబే
20. మొహమ్మద్ ముస్తఫా

సుప్రీంకోర్టు ముఖ్యమైన కేసులు – తీర్పులు

ఏకే గోపాలన్ కేసు (1950)
-మద్రాస్‌కు చెందిన ఏకే గోపాలన్ అనే వ్యక్తిని మద్రాస్ ప్రభుత్వం నిరోధక నిర్బంధ చట్టం-1950 కింద అదుపులోకి తీసుకుంది. అయితే ఏకే గోపాలన్ రెండు అంశాలపై తన నిర్బంధాన్ని ప్రశ్నించాడు. తనను నిర్బంధంలోకి తీసుకోవడం రాజ్యాంగంలోని 19వ నిబంధన ప్రకారం స్వేచ్ఛా హక్కుకు విరుద్ధమని, 21వ నిబంధన కింద వ్యక్తిగత స్వేచ్ఛకు నిర్బంధం వ్యతిరేకమని వాదించాడు.

చంపకం దొరైరాజన్ కేసు (1951)
-తమిళనాడులోని విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన కేసు. మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. దీని ద్వారా 15(4) సెక్షన్‌ను నూతనంగా చేర్చారు.

శంకరీప్రసాద్ కేసు (1952)
-మొదటి రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలను ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కేసు వేశారు. పార్లమెంటుకు ఏ అంశాన్నయినా సవరించే అధికారం ఉన్నదని ఈ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారి న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించింది.

బేరుబారి కేసు (1960)
-దేశంలో ఏదైనా ప్రాంతాన్ని వేరే దేశ భూభాగంలో కలుపడానికి ముందుగా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

కేశవ్‌సింగ్ కేసు (1964)
-కేశవ్‌సింగ్ అనే జర్నలిస్టు శాసనవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అతనికి జైలుశిక్ష విధించారు. ఈ కేసులో కోర్టు తీర్పునిస్తూ నిబంధన 21కి విరుద్ధంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది.

సజ్జన్‌సింగ్ కేసు (1965)
-ఆస్తి హక్కుకు సంబంధించి చేసిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమేనని ప్రకటించింది.

గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం (1967)
-ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

కేశవానంద భారతి వర్సెస్ కేరళ (1973)
-ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24వ, 25వ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ఈ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారి ప్రయోగించింది.

మేనకాగాంధీ కేసు (1978)
-ప్రజాప్రయోజన వ్యాజ్యంపై పాస్‌పోర్టు అధికారి పాస్‌పోర్టు చట్టం-1967 కింద మేనకాగాంధీ పాస్‌పోర్టును రద్దుచేశారు. ప్రజా ప్రయోజనం అన్నది బహుళ విస్తృతమైనదని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. 19, 14, 21వ నిబంధనలు సెక్షన్ 10(3) పాస్‌పోర్టు చట్టం-1967 ప్రకారం ఉల్లంఘనకు గురయ్యాయని కోర్టు గమనించింది. 21వ నిబంధన కింద వ్యక్తి స్వేచ్ఛ అనే దానికి సాధారణ అర్థం ఇచ్చింది. అయితే చట్టం సహజ న్యాయానికి అనుగుణంగా ఉండాలని పేర్కొన్నది.

వామన్‌రావు కేసు (1981)
నీరజాచౌదరి కేసు (1984)
-బాల కార్మికులకు సంబంధించి సమర్థవంతమైన చట్టాలు రూపొందించాలని ఈ కేసులలో సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.

షాబానో కేసు (1985)
-ముస్లిం మహిళకు కూడా భరణం ఇవ్వాలని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ కేసు (1992)
-మైనారిటీ విద్యాసంస్థల్లో మైనారిటీయేతర విద్యార్థులకు 50 శాతం సీట్లు కల్పించాలని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

ఇందిరాసహాని వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా (1992)
-వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.

ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ (1993)
-ప్రాథమిక హక్కులలో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సరళా ముద్గల్ (1995)
-ఒక వ్యక్తి హిందూ వివాహ చట్టం ప్రకారం పెండ్లి చేసుకున్న తర్వాత, మరో వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.

ఎస్‌ఆర్ బొమ్మై కేసు (1994)
-సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేముందు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రకటించింది.

చంద్రకుమార్ కేసు (1997)
-న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ప్రకటించింది.

టీఎంఏ పాయ్ కేసు (2002)
-మైనారిటీ విద్యాసంస్థల్లో ఆయా సంస్థల ప్రమాణాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఇనామ్‌దార్ కేసు (2005)
-ప్రైవేటురంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీని కోసం 93వ రాజ్యాంగ సవరణ చేశారు.

ఐఆర్ కొయలో కేసు (2006)

-9వ షెడ్యూల్‌కు న్యాయసమీక్ష వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

అశోక్ కుమార్ ఠాకూర్ కేసు (2007)
-93వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సెంట్రల్ యూనివర్సిటీ, ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను కూడా 50 శాతానికి పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.