ఐ లవ్ యూ ఢిల్లీ.. ఇది భారతావని విజయం : క్రేజీవాల్
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. జాతీయపార్టీలని ధీటుగా ఎదుర్కొని సామాన్యుడు పార్టీ గెలుపొందింది. ఈ ఫలితాలపై పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.
ఫలితాల అనంతరం పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి క్రేజీవాల్ మాట్లాడారు. ఆమ్ ఆద్మీపై విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. ఐ లవ్యూ ఢిల్లీ. ఇది యావత్ భారతావని విజయం. దిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో ‘పని రాజకీయం’ పురుడు పోసుకుంది. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి అన్నారు.